Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణం మూజువాణి ఓటుతో వీగిపోయింది. స్పీకర్ సభలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తు విపక్ష సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి నేటి వరకూ సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో విపక్షాలు చేసిన విమర్శలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అనంతరం సభ గురువారానికి వాయిదాపడింది.