
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM కిసాన్) లబ్ధిదారులకు శుభవార్త. 22వ విడత పిఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. మార్చి 13న గౌహతి పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 22వ విడత నిధులను విడుదల చేస్తారు. ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు సుమారు రూ.19,000 కోట్లు విడుదల చేయనున్నట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం, ఫిబ్రవరి 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan)ను ప్రారంభించింది. ఈ పథకం కింద, దేశంలోని అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మూడు వాయిదాలలో రూ.6,000 పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.