Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచ కప్‌ 2026లో విధ్వంసకర ఆటతో చెలరేగిన టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. బుధవారం ఐసిసి, టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో ఇషాన్ ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ప్రపంచ కప్‌కు ముందు ఇషాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగిన కిషన్ 871 రేటింగ్ పాయింట్లు సాధించిన నంబర్ 2 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇక, భారత మరో స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తన నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. అభిషేక్ 875 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 848 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్‌ బ్యాటర్ ఫిల్ సాల్ట్ శ్రీలంక బ్యటార్ పాతుమ్ నిస్సాంక వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నారు.

ఇక, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. T20 ప్రపంచ కప్ 2026లో టిమిండియా తరపున బుమ్రాతోపాటు అత్యధిక వికెట్లు పడగొట్టినప్పటికీ.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో తన వరుణ్.. 740 రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 753 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు.పాకిస్తాన్‌కు బౌలర్ అబ్రార్ అహ్మద్ మూడో స్థానానికి ఎగబాకగా.. ఆదిల్ రషీద్, కార్బిన్ బాష్ వరుసగా నాలుగు, ఐదు స్థానంలో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని 702 రేటింగ్ పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నాడు.