Reading Time: < 1 minute

ఇటీవలే టి-20 ప్రపంచకప్ ముగిసింది. భారత్ విశ్వవిజేతగా నిలవడంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్ మజా ఇచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం కానుంది. ఈసారి తమ అభిమాన జట్టు అద్భుతంగా ఆడాలని.. కప్పు కొట్టాలని అభిమానులు ఇప్పటి నుంచే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో ఓ ప్రశ్న నెలకొంది. ఆ జట్టు మాజీ సారథి.. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లో ఆడుతాడా.? లేదా.? అనే సందేహం నెలకొంది. దీనిపై ఆ జట్టు సిఇవొ కాశీ విశ్వనాథ్ ఓ శుభవార్త తెలిపారు. మాజీ సారథి ఎంఎస్ ధోనీ.. ఈ సీజన్ మొత్తం ఆడుతాడని ఆయన వెల్లడించారు.

తాజాగా కాశీ విశ్వనాథ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ధోనీని సీజన్ మొత్తం మైదానంలో చూడొచ్చా.? అని రిపొర్టర్ అడిగిన ప్రశ్నకు.. ‘‘ధోనీ ఈ సీజన్ మొత్తం ఆడతాడు. అన్ని మ్యాచుల్లోనూ బరిలోకి దిగుతాడు’’ అని సమాధానం ఇచ్చారు. అయితే ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వినియోగిస్తారా? అనే ప్రశ్నకు ‘‘ఆ ప్రశ్న గురించి నేనేం మాట్లాడలేను. అది క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయం. స్టాఫ్ నిర్ణయం తీసుకుంటారు. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ తీసుకొనేది కాదు. బ్యాటర్‌గా ఆడతాడా? వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గానా? ఇంపాక్ట్ ప్లేయర్‌గానా అనేది వారు డిసైడ్ చేస్తారు’’ అని సమాధానం ఇచ్చారు.