Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026కి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ని ప్రకటించారు. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య బెంగళూరు వేదికగా జరుగనుంది. మార్చి 29న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య, మార్చి 30వ తేదీ రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. మూడు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత మిగితా షెడ్యూల్‌ని విడుదల చేస్తామని ఐపిఎల్ బోర్డు పేర్కొంది.