Reading Time: < 1 minute

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో వెయ్యి మంది పేదల ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టిన ఘటనపై ఆయన మండిపడ్డారు. భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదలను బలవంతంగా గెంటేసిందని, గతంలో అదే భూదాన్ భూముల్లో కొంతభాగాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులపరం చేసిందని కెటిఆర్ ఆరోపించారు. వాస్తవానికి వెలుగుమట్లలో ఇళ్లు కూలగొట్టిన ప్రాంతంలోని భూములు భూదాన్ భూములని ఆయన తెలిపారు. 1950ల్లో ఆచార్య వినోభాబావే నాయకత్వంలో జరిగిన భూదానోద్యమంలో పలువురు దాతలు భూములను దానం చేశారన్నారు.

అదేవిధంగా వెలుగుమట్లలో కూడా ఇద్దరు దాతలు 62 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకు విరాళంగా ఇచ్చారన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేవరకు కూడా ఆ భూమి భూదాన్ బోర్డు పేరుతోనే పట్టాతో ఉందని దాదాపు 30 ఏళ్లకుపైగా భూదాన్ బోర్డు పేరు మీద ఉన్న ఆ భూములను నాడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదకు మార్చిందని ఆయన మండిపడ్డారు. ఆ భూమిని 2014 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ భూదాన్ బోర్డు 1,895 మందికి పట్టాలు చేసిందన్నారు.