
2025లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాలో దండలు అమ్ముకుంటూ కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసిన మోనాలిసా.. మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి తిరువనంతపురం పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది. తమను రక్షించాలంటూ మోనాలిసా తన ప్రియుడితో కలిసి తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే.. మోనాలిసా, కేరళకు చెందిన ఫర్హాన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్‌తో మోనాలిసా డేటింగ్ చేస్తోంది. మోనాలిసా-ఫర్మాన్ ఖాన్ ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమను మోనాలిసా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తమకు రక్షణ కల్పించాలని మోనాలిసా కోరినట్లు తెలుస్తోంది. ప్రియుడితో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.