Reading Time: < 1 minute

19 ఏళ్ల యువ పైలట్ నికో బ్రే తన విమానాన్ని రద్దీగా ఉన్న రహదారిపై సురక్షితంగా దించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటన 2026 మార్చి 6వ తేదీ మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.19 ఏళ్ల యువ పైలట్ నికో బ్రే తన స్నేహితుడితో కలిసి చిన్న సింగిల్ ఇంజిన్ విమానంలో (Cessna 150) ప్రయాణిస్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్ శక్తిని కోల్పోయింది. విమానం నేల నుండి కేవలం 500 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోవడంతో పైలట్ ఏమాత్రం కంగారు పడకుండా మొదట బీచ్ దగ్గర ఉన్న A1A రోడ్డుపై దించాలని అనుకున్నా,

అది ఇరుగ్గా ఉండటంతో వెడల్పుగా ఉన్న ఇండియన్ టౌన్ రోడ్డును ఎంచుకున్నాడు. విమానం కిందికి రావడం గమనించిన ఒక ట్రక్కు డ్రైవర్ రోడ్డుపై ట్రాఫిక్‌ను ఆపి విమానం దిగడానికి ఖాళీ ప్రదేశం కల్పించారు. దీంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఏ వాహనాన్ని ఢీకొట్టకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.ఈ ఘటనలో పైలట్, అతని స్నేహితుడు మరియు రోడ్డుపై ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. 19 ఏళ్ల వయసులోనే నికో బ్రే ప్రదర్శించిన ధైర్యం మరియు నైపుణ్యాన్ని స్థానిక అధికారులు, ప్రజలు మెచ్చుకున్నారు.