Reading Time: < 1 minute

అమరావతిలో వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన భారీగా మంటలు చెలరేగి.. ఎల్ అండ్ టి సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయి. భారీ మంటలు ఎగసి పడటంతో పరిసర ప్రాంతంలో దట్టంగా పొగ అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.