Reading Time: < 1 minute

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటిఆర్ సోషల్‌మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు సంబంధించిన విషయాలు, పార్టీ వ్యవహారాలు, ఇతర విషయాలను ఆయన సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ ఫన్నీ పోస్ట్ పెట్టారు. జిమ్‌లో దిగిన ఫోటోని షేర్ చేసిన కెటిఆర్.. ఇంతకాలం తన పొట్టని దాచలేక విసిగిపోనని.. పేర్కొన్నారు. ‘‘ఆరు నెలల తర్వాత మళ్లీ ట్రైనింగ్ మొదలు పెట్టాను జూలైలో నాకు 50 సంవత్సరాల వచ్చే నాటికి మంచి షేప్‌లోకి రావాలని ఆశిస్తున్నా’’ అని కెటిఆర్ రాసుకొచ్చారు.