
వెలుగు మట్ల భూదాన్ భూముల్లో కొందరు ముఠాగా ఏర్పడి పేదలను అడ్డంపెట్టుకొని మోసం చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాల అందజేత కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కోర్టు తీర్పు మేరకే ప్రభుత్వం ఆదేశాలతో ఖాళీ చేయించి కలెక్టర్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. సమాంతర వ్యవస్థ నడుపుతూ ముఠా సభ్యులు ఎవరిని లోపలికి రానీయకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని.. అయినా, గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు.
కోర్టులో కేసు ఉండటంతో అక్కడ తాము ఎలాంటి సౌకర్యాలు కల్పించలేక పోయామని మంత్రి తుమ్మల అన్నారు. ప్రస్తుతం భూదాన్ ట్రస్టు లేదు..అది సీసీఎల్ఏకు బదలాయించిందన్నారు. ముఠా చేతిలో నుంచి బాదితులను రక్షించేందుకు తాము అనేక ప్రయత్నాలు చేసామని తెలిపారు. భూదాన్ భూముల్లోనే బాధితులకు ఇళ్లు ఇవ్వాలని సిఎం, ముగ్గురు మంత్రులం నిర్ణయించామని.. డిసెంబర్ 9న సిఎం చేతుల మీదుగా ఇళ్ల గృహ ప్రవేశం చేస్తామని.. అక్కడ అన్ని మౌళిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.