Reading Time: < 1 minute

హీరోయిన్‌గా పరిచయమైన అనతి కాలంలోనే స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. దక్షిణాది ఇండస్ట్రీలతో హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు సాయి పల్లవి బాలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ఏక్ దిన్’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది సాయి పల్లవి. తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రోహన్ పాత్రలో జునైద్, మీరా పాత్రలో సాయిపల్లవి నటించారు. స్నేహా దేశాయ్, స్పందన్ మిశ్రా ఈ చిత్రానికి రచనా సహకారం అందించగా.. మన్సూర్ ఖాన్, అమిర్ ఖాన్, అపర్ణా పురోహిత్ నిర్మించారు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది.