
కరీంనగర్: పెద్ద నగరాల్లో చెత్త సేకరణ వ్యర్థాల తరలింపు సమస్యగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో కేంద్ర మంత్రి కట్టర్ కరీంనగర్ కి వచ్చినప్పుడు కరీంనగర్ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్నటువంటి అనారోగ్యాలకు కారణం అవుతున్న డంపింగ్ యార్డ్ తరలించాలని విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చొప్పదండి వచ్చినప్పుడు కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్య స్థానిక జిల్లా నేతలము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, ఆయన సభా వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ నుండి తరలించిన డంపింగ్ యార్డ్ వరంగల్ కరీంనగర్ మధ్యలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ మేనేజ్మెంట్ విషయంలో ఇబ్బందులు లేకుండా రెండు నగరాల మధ్య ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఈరోజు శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కమిషనర్ కార్పొరేటర్లు కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ లో వెస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి సరైన చర్యలు తీసుకోలేకపోయారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈరోజు డంపింగ్ యార్డ్ ను పరిశీలించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు డంపింగ్ యార్డ్ తరలింపులో డైలీ వచ్చే వెస్ట్ మేనేజ్మెంట్, ఇప్పటికే స్టోర్ అయిన వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా తరలించాలని దానిపై ఒక విధానాన్ని తీసుకుంటామన్నారు.
ఒక స్వచ్ఛంద సంస్థ చెత్త తరలించడానికి ముందుకు వస్తున్నామని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రజాప్రతినిధులు అధికారుల బాధ్యత తీసుకున్నారని, డంపింగ్ యార్డ్ వల్ల కరీంనగర్ ప్రజల శ్వాసకోస ఇబ్బందులతో పాటు అనేక వ్యాధులు సంభవిస్తున్నాయని, 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ ను ఇప్పటికిప్పుడు తరలించేందుకు ఒక రోజులో అయ్యేది కాదు అని, సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో తరలిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకతీతంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రజా ప్రతినిధులుగా ముఖ్యమంత్రి హామీ మేరకు డంపింగ్ యార్డ్ తరలింపుకు చొరవ తీసుకుంటామన్నారు. డంపింగ్ యార్డ్ తరలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమిషనర్ ప్రపుల్ దేశాయి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ అంజన్ కుమార్, పలువురు కార్పొరేటర్లు ,ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.