
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు. ఇజ్రాయెల్ లో ఎయిర్ పోర్టులు, సీపోర్టులకు ఆటంకం కలగలేదన్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, పోరాడే దేశం అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తామని హెచ్చిరించారు. యుద్ధంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌లో నిరంకుళ పాలన నుంచి ఆ దేశ ప్రజలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇప్పటికే ఇరాన్ ఎముకలు విరగ్గొడుతున్నామని తెలియజేశారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ కాలిబాఫ్ స్పందించారు. తాము కాల్పుల విరమణకు సిద్దంగా లేమని, పోరాటమే తమ ద్వేయమని తెలిపారు. ఇరాన్‌పై యుద్ధం స్వల్పకాలిక చర్య అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఒకవేళ హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయాలని చూస్తే దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.