Reading Time: < 1 minute

మెదక్: నిశ్చితార్థం జరిగిన వారం రోజులకే ఓ యువతి చెరువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో జరిగింది. అప్పాజీపల్లి గ్రామంలో రూప(22) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. రూపకు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. వారం రోజుల క్రితం నిశ్చితార్థం కూడా జరిపించారు. గత నాలుగు రోజుల నుంచి ఆమె దిగాలుగా ఉంది. సోమవారం గ్రామశివారులో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.