Reading Time: < 1 minute

హైదరాబాద్: నటుడు రాజేంద్ర ప్రసాద్ మళ్లీ నోరు జారారు. తమిళనాడు ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ పై రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు కాంతారావు గొప్పతనం గురించి చెప్పడంతో పాటు ఎంజిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు 2025 ప్రదానోత్సవంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. కాంతారావు నటన చూసి ఎంజిఆర్‌ షాక్‌ అయ్యారంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. జానపదాల్లో కాంతారావు క్రేజ్‌ చూసి ఎంజిఆర్‌ భయపడ్డారని తెలిపారు. ఎవడ్రా వీడు ఇండియన్ సినిమాలను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడని ఎంజిఆర్ అనడంతో పాటు భయంతో వణికిపోయాడని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేశారు. ఎంజిఆర్ అభిమానులు రాజేంద్ర ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది ఆరాధించే దిగ్గజ నటుడిని, ప్రజానాయకుడిని ఇంతలా కించపరచడం సరికాదని ఎంజిఆర్ అభిమానులు, తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు మండిపడతున్నారు. తెలుగు నటుడిని ప్రశంసిస్తూ ఎంజిఆర్ ను కించపరిచడం సరికాదని దుయ్యబట్టారు.  గతంలోనూ బ్రహ్మానందం, అలీ వంటి తోటి నటులపై రాజేంద్ర ప్రసాద్ ఇలాగే వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శపాలైన విషయం తెలిసిందే.