
వార్ ఎఫెక్ట్‌తో 100డాలర్లు దాటిన ముడిచమురు ధర
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 12లక్షల కోట్ల సంపద ఆవిరి
చికాగో : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్‌కు వంద డాలర్లు దాటిపోయింది. యుద్ధ ముడి చమురుధర పెరగడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఒక్కరోజే రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది. ముడి చమురు రవాణాకు కీలక ప్రాంతమైన హా ర్మూజ్ జలమార్గం మూసివేయడంతో ధరలు రె ట్టింపు అయ్యాయి. సోమవారం ఉదయం అంతర్జాతీయ ధరల ప్రకారం బ్రెంట్ చమురు ధర ఒక బ్యారెల్ 119.50 డాలర్ల వరకు చేరి, తర్వాత 106 డాలర్లకు తగ్గింది. అమెరికాలో ఉత్పత్తి అ య్యే వెస్ట్ టెక్సాస్ చమురు ధర కూడా 119 డాలర్లకు పైగా వెళ్లి తర్వాత 103 డాలర్లకు పడిపోయింది. బహ్రెయిన్ తమ దేశంలో కీలకమైన తాగునీటి శుద్ధి కేంద్రంపై ఇరాన్ దాడి చేసిందని ఆరోపించింది. మరోవైపు ఇరాన్ దాడితో బహ్రెయిన్ చమురు శుద్ధి కేం ద్రంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో సరఫరా నిలిచిపోయింది.
ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్‌లోని చ మురు నిల్వ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. రెండో వారం యుద్ధం కొనసాగడంతో చమురు ధరలు పెరగ్గా, దేశాలకు కష్టాలు మొదలయ్యాయి. పర్షియన్ గల్భ్ నుంచి ప్రపంచానికి చమురు, గ్యాస్ సరఫరా ఎంతో కీలకమైం ది. హార్ముజ్ సముద్ర మార్గం ద్వారా రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అ వుతుంది. అయితే క్షిపణి, డ్రోన్ దాడుల భయం తో అనేక ట్యాంకర్లు ఈ మార్గంలో ప్రయాణం నిలిపివేశాయి. దీంతో ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. ఈ పరిణామాలతో గ్లోబల్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. శుక్రవారం యుఎ స్‌ఎస్ అండ్ పి 1.3 శాతం, నాస్‌డాక్ కంపోజిట్ 1.6 శాతం పడిపోయాయి. భారత మార్కెట్లు కూడా భారీగా నష్టాలను చూస్తున్నాయి.
రూ.12 లక్షల కోట్లు ఆవిరి
ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు భారీగా పెరడం గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్‌మార్కెట్లను కుదిపేసింది. సెన్సెక్స్ ఓ దశలో 2000 పాయింట్లకు పైగా పడిపోగా, ఆ తర్వాత కోలుకుని 1,353 పాయింట్లు (1.71 శాతం) తగ్గి 77,566 వద్ద ముగిసింది. నిఫ్టీ 422 పాయింట్లు (1.73 శాతం) పడిపోయి 24,028 పాయింట్లకు చేరింది. బ్యాంకింగ్, ఆటో, లోహ, ఇంధన, వినియోగ వస్తువుల రంగాలకు చెందిన షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి. యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. సోమవారం ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.12 లక్షల కోట్లు ఆవిరైంది. ఇరాన్ యుద్ధం కారణంగా ఫిబ్రవరి ఫలితంగా పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.22 లక్షల కోట్లు తగ్గింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఫిబ్రవరి 27న రూ.463 లక్షల కోట్లు ఉండగా, మార్చి 9 నాటికి అది రూ.441 లక్షల కోట్లకు తగ్గింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లో చమురు ధరలు 60 శాతం పెరి గి ఒక బ్యారెల్‌కు 105 డాలర్ల వరకు చేరాయి. నిపుణులు ఈ ధరలు 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
92కి పడిపోయిన రూపాయి
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 46 పైసలు తగ్గి 92.33 వద్ద ముగిసింది. ఇదే ఇప్పటివరకు కనిష్ట స్థాయి, చమురు ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో బంగారం, వెండి ధరలు కూడా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.1.60 లక్షలకు చేరింది. ఒక కిలో వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2.63 లక్షలుగా నమోదైంది. ఆసియా, అమెరికా మార్కెట్లలో కూడా పతనం కనిపించడం ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలను పెంచుతోంది.