Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. వైద్యురాలు దీపిక ఆత్మహత్యకు కారణమైన డాక్టర్‌ అమర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  అనంతపురం మెడికల్ కాలేజీలో చదువుతూ విజయవాడ జిజిహెచ్‌లో వైద్యురాలిగా దీపిక విధులు నిర్వహిస్తున్నారు. నందిగామలో ప్రభుత్వ డాక్టర్ గా అమర్ విధులు నిర్వహిస్తున్నారు. దీపికతో ప్రేమయాణం నడిపించి చివరలో పెళ్లి చేసుకోనని అమర్ చెప్పడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు విచారణలో తేలింది. గత నెల 5న ప్రమాదకర ఇంజెక్షన్ చేసుకుని దీపిక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు అమర్‌తో డాక్టర్‌ దీపిక మాట్లాడినట్టు కాల్ హిస్టరీలో తెలిసింది. అమర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకి అమర్ ను తరలించారు.