Reading Time: < 1 minute
Rajahmundry Adulterated Milk Tragedy Death Toll Rises Several Critical On Ventilator

Rajahmundry Adulterated Milk: రాజమండ్రిలో కల్తీపాల వల్ల మంచాన పడ్డవాళ్లు ఇంకా కోలుకోవటం లేదు. రోజుకొకరుగా చనిపోతూ ఉండటం అక్కడి ప్రజలను ఆందోళన కలిగిస్తుంది. ఇంతవరకు ఏడుగురు చనిపోగా.. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో కల్తిపాల ఘటన వెలుగు చూసి 10 రోజులు అయింది. కానీ ఇప్పటికీ ఆ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు బాధితుల పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది.

HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగుల నిరసన.. నేటి నుంచి నిరవధిక సమ్మె

ఇప్పటికీ పలువురు వెంటిలేటర్ పైనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల ఆరోగ్యం కాస్తైనా మెరుగైన సూచనలు లేకపోగా ఒక్కొకరుగా చనిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో తొమ్మిది మందిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. నలుగురు పేషెంట్లకు డయాలసిస్ నిర్వహిస్తున్నారు. కల్తి పాలు ఘటనకు సంబంధించి ఇంతవరకు ఫారెన్సిక్ ల్యాబ్ నివేదికలో రాలేదు. దీంతో పాల వల్లే విష ప్రభావం పడిందని భావిస్తున్న అసలు కారణాలు తెలియరావడం లేదు. అయితే ఎఫ్ఎస్ఎల్ (NSL) రిపోర్ట్ అందడానికి ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది అంటున్నారు. చూడాలిమరి ఇంకా ఈని రోజులు పేరుతో రిపోర్ట్స్.. అవి చూసి సరైన చికిత్స అందించేది ఎప్పుడో.

Rapido Story: ఒకప్పటి క్లాస్ టాపర్, ఇప్పుడు రాపిడో రైడర్.. జీవితం నేర్పే పాఠం.. నెటిజన్లను కదిలిస్తున్న జర్నీ..