
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.. ఇక అంతా సర్దుకుంటుందనుకునే లోపే పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ జరిగి 24 గంటలు కూడా గడవకముందే ఇరాన్ మిత్రపక్షమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్ దాడులకు నిరసనగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ క్లోజ్ చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా హార్మూజ్ జలసంధిని తెరవాలని.. లేదంటే తీవ్ర దాడులు చేస్తామని హెచ్చరించింది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే హార్మూజ్ ఓపెన్ చేస్తామని ఇరాన్ పంతం పట్టింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియా వార్ ఎపిసోడ్ మళ్లీ మొదటికి వచ్చింది. అయితే.. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో గందరగోళానికి ప్రధాన కారణం మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్తానే. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్‌తో పాటు లెబనాన్‌కు వర్తిస్తుందని మీడియేటర్ పాకిస్తాన్ పేర్కొంది.
►ALSO READ | పాకిస్తాన్ రాజధానిలో రెండు రోజులు సెలవులు : చర్చల సందర్భంగా అడుగడుగునా ఆంక్షలు.. భయం భయం
తీరా తీస్తే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి 24 గంటల గడవకముందే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. సీజ్ ఫైర్ ఓన్లీ ఇరాన్‌కే వర్తిస్తుందని లెబనాన్‌కు కాదంటున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. వీళ్ల వాదన ఇలా ఉంటే.. తమ మిత్రపక్షమైన లెబనాన్‌కు కూడా సీజ్ ఫైర్ వర్తిస్తుందని ఇరాన్ వాదిస్తోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందంలో గందరగోళం ఏర్పడి కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇజ్రాయెల్ దాడులకు కౌంటర్ ఇరాన్ మళ్లీ హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేసింది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే కాల్పుల విరమణ ఒప్పందం నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. హార్మూజ్ జలసంధి తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా లెబనాన్ ఇష్యూని మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. మధ్యవర్తిత్వం వహించి అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపామని జబ్బలు చరుచుకున్న పాకిస్తాన్ ఈ గందరగోళాన్ని ఎలా పరిష్కారిస్తుందో చూడాలీ.