Reading Time: < 1 minute
SIB Bank Jobs 2026: సౌత్‌ ఇండియా బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

ప్రభుత్వ పరిధిలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన సౌత్‌ ఇండియా బ్యాంక్‌ (SIB)లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన పలు ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద వల్నెరబిలిటీ అసెస్‌మెంట్‌ అండ్‌ పెనెట్రేషన్‌ టెస్టింట్‌ (వీఏపీటీ), ఐటీ జనరల్‌ కంట్రోల్స్‌ (ఐటీజీసీ) ఆడిట్‌ (స్కేల్‌ 1 & 2), ఆర్‌ఈడీ టర్మ్‌ లీడ్‌ (స్కేల్‌ 1 & 2) పోస్టులను భర్తీ చేయనుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ (బీటెక్‌)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఐటీ లేదా ఐఎస్‌ ఆడిట్‌ లేదా అప్లికేషన్‌ సెక్యురెటీ టెస్టింగ్‌ వంటి నోటిఫికేషన్ లో సూచించిన విధంగా సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయస్సు పరిమితి ఫిబ్రవరి 1, 2026 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 9, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

సౌత్‌ ఇండియా బ్యాంక్‌ ఉద్యోగాల ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.