Reading Time: < 1 minute
Spirit Vivek Oberoi First Look Revealed As Villain In Prabhas Starrer

Vivek Oberoi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్ పై సినీ ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మోస్ట్ వైలెంట్ స్టోరీస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి Vanga ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘యానిమల్’ తర్వాత సందీప్ – ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఇండియన్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా చిత్రబృందం బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.

Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!

సోషల్ మీడియాలో విడుదలైన ఈ పోస్టర్‌లో వివేక్ ఒబెరాయ్ నోట్లో సిగార్, చేతిలో ఆయుధంతో గంభీరంగా కనిపించారు. ఈ లుక్ చూసిన అభిమానులు ఆయన పాత్ర ప్రతినాయకుడిగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అధికారికంగా కథ వివరాలు బయటకు రాకపోయినా, ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. “మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో” అనే క్యాప్షన్‌తో పోస్టర్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రభాస్ ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు వివేక్ ఒబెరాయ్ లుక్ ఆ హైప్‌ను మరింత పెంచింది.

Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు నాకు మోరల్ విక్టరీ