Reading Time: < 1 minute
Appsc Releases Group 1 Final Results For 87 Posts

APPSC: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–1 ఉద్యోగాల నియామకాల తుది ఫలితాలను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. 2023 డిసెంబర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్ నెంబర్ 12/2023కు సంబంధించిన ఫలితాలను తాజాగా ప్రకటించింది. మొత్తం 89 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి 2023లో నోటిఫికేషన్ జారీ చేయగా, ఇందులో 87 పోస్టులకు తుది ఫలితాలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు 2 స్పోర్ట్స్ కోటా పోస్టుల ఫలితాలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఎపీపీఎస్సీ వెల్లడించింది. గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పూర్తి వివరాలను ఎపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రోల్ నెంబర్ ద్వారా ఫలితాలను పరిశీలించుకోవచ్చని ఎపీపీఎస్సీ సూచించింది.

Read Also: Ajit Pawar Wife Oath Ceremony: నేడే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్‌ ప్రమాణస్వీకారం.. శాఖలు ఇవే..?