
హైదరాబాద్: చెంచులు అందరికీ మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా శనివారం శాసనసభలో ఆయన మాట్లాడారు. సింగరేణి ప్రాంతాల్లో పట్టాల పంపిణీపై కేబినెట్ చర్చ జరిపారు. గిరిజన ప్రాంతాల్లో 12, 500 ఇందిరమ్మ ఇళ్లు, గత ప్రభుత్వం కమీషన్ల కోణంలోనే ఇళ్లను పంపిణీ చేసిందని, మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలియజేశారు. ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ లు ఇళ్లకు నిధులు ఇస్తున్నామని, గత ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ ఉంటేనే ఇళ్లు ఇచ్చిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.