Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సభ కు రాకపోవడం సరికాదని తెలంగాణ జా గృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. బిఆర్‌ఎస్ మనుగడ కొనసాగాలంటే కెసిఆర్ అసెంబ్లీకి రావాలని, కెసిఆర్ అసెంబ్లీకి రాకుంటే బిఆర్‌ఎస్ పా ర్టీకి ఆ భగవంతుడు కూడా కాపాడలేరని తీ వ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా జలాలపై కెసిఆర్ మా ట్లాడి అధికార పార్టీ నోరు మూయించాలని పేర్కొన్నారు. నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేయవద్దని సూచించారు. తన రాజీనామా ఆమోదం కోరేందుకు శుక్రవారం శాసనమండలికి వచ్చిన కవిత అక్కడ మీడియాతో మాట్లాడారు. కెసిఆర్‌ను టెర్రరిస్ట్‌తో పోల్చుతూ రేవంత్ చేసిన విమర్శలకు ఒక కూతురిగా తన రక్తం ఉడుకుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక్కసారి కాదు, రెండుసార్లు ఉరేయాలని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడిని ఉరితీయాలని అంటే రక్తం మరుగుతోందని వ్యాఖ్యానించారు. పాలమూరుకు తీర ని అన్యాయం చేస్తున్నదే రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు.

హరీశ్‌రావు హౌస్‌లో మాట్లాడితే అంతా మ్యాచ్ ఫిక్సింగే

పాలమూరు రంగారెడ్డిలో అక్రమాలకు పాల్పడ్డ వారిని బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ను చెయ్యడం అన్యాయం అని హరీష్‌రావు ఉద్దేశిస్తూ కవిత ఘాటు వ్యాఖ్య లు చేశారు. బిఆర్‌ఎస్ బబుల్ షూటర్లకే డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని విమర్శించారు. హరీశ్ రావు పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్నారని, ఆయన హౌ స్‌లో మాట్లాడితే అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో రేవంత్ రెడ్డితో ఆయ న ఛాంబర్‌లో హరీశ్ రావు ప్రత్యేకంగా మాట్లాడుకున్నది అందరికీ తెలుసు అని, అలాంటి వ్యక్తికి నీళ్ల గురించి మాట్లాడే అవకారం ఇస్తే బిఆర్‌ఎస్‌కు నష్టమే అని పే ర్కొన్నారు. తాను సెప్టెంబర్ 3 తేదీన ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేశానని, 4 నెలలుగా తన రాజీనామాను ఆమోదించలేదని కవిత పేర్కొన్నారు. హౌస్‌లో మాట్లా డి రాజీనామా ఆమోదింపచేసుకుంటానని తెలిపారు.