
చిన్నారి అవ్యాన్ సాహు ఇండోర్‌కు చెందిన ఓ జంటకు వివాహం అయిన పదేళ్ల తర్వాత జన్మించాడు. ఇండోర్‌లో కలుషిత నీరు తాగి చనిపోయిన బాధితుల్లో అతి చిన్నవాడు. అవ్యాన్‌కు తాగించిన పాలను మరిగించే క్రమంలో తల్లి వాటిలో మున్సిపాలిటీ సప్లయ్ చేసిన నల్లా నీటిని కలిపింది. అనంతరం మరిగిన పాలను చల్లార్చి తాగించిన కాసేపటికే వాంతులు విరోచనాలతో అవ్యాన్ చికిత్స పొందుతూ మరణించాడు. పదేళ్లుగా సంతానం కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులకు అధికార యంత్రాంగం నిర్లక్షం కారణంగా కడుపుకోత మిగిలింది. అయితే వీరికి ప్రభుత్వం రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మా బిడ్డనే కోల్పోయామని, ఆ డబ్బు ఏం చేసుకోవాలని, పరిహారం మాకు వద్దని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు.