Reading Time: < 1 minute

మూడు రోజుల విరామం తరువాత శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఐదు కీలక బిల్లులను సభ ఆమోదించింది. ఇందులో అత్యధికంగా నాలుగు బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి తరపున అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టగా ఒక బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు. తెలంగాణ మున్సిపాలిటీల (నాలుగో సవరణ) బిల్లు-2025, జీహెచ్‌ఎంసీ (సవరణ) బిల్లు-2025, జీహెచ్‌ఎంసీ (రెండో సవరణ) బిల్లు- 2025తో పాటు తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు- 2025 ఉన్నాయి. ఈ బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ సభలో ప్రవేశపెట్టారు. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ (సవరణ) బిలు ్ల-2025ను సభలో ప్రవేశపెట్టారు. ఈ ఐదు బిల్లులను సభ ఆమోదించినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. అలాగే జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో ప్రవేశపెట్టారు. అలాగే మున్సిపాలిటీ సవరణ బిల్లు- 1, 2 లను మండలిలో ప్రవేశపెట్టారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుతో పాటు అమిటీ యూనివర్సిటీ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు.