
దుర్గం చెరువులో అక్రమణ వ్యవహారం, అక్రమంగా ఎస్‌టిఎస్ ప్రైవేట్ సంస్థకు చెందిన వాహనాలను పార్కిగ్ చేస్తున్నట్లు హైడ్రా సూపర్‌వైజర్ కాంత్రి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబ్బాక బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు వెంకటరెడ్డి అనే ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగిందని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ మోహన్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గత డిసెంబర్ నెలలో దుర్గం చెరువు అక్రమణలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు మాదాపూర్‌లోని దుర్గం చెరువును పరిశీలించారు. 2014లో హెచ్‌ఎండిఏ దుర్గం చెరువుకు సంబంధించి ఎఫ్‌టిఎల్ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసిందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు చెరువు ప్రాంతాన్ని మట్టి, రాళ్లతో నింపి, దుర్గం చెరువులోని సుమారు 5 ఎకరాల భూమిని అక్రమించి భూమిని అక్కడ ఎస్‌టిఎస్ ప్రైవేట్ రవాణా పార్కింగ్ కోసం ఉపయోగించుకుంటున్నారని అన్నారు. అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని, దుర్గం చెరువు ఆక్రమణ 2014 నుండి కొనసాగుతుందన్నారు. చెరువును ఇసుక, రాళ్లతో అక్రమంగా నింపి, చెరువు ప్రాంతాన్ని ఆక్రమించడం ద్వారా సదరు వ్యక్తులు చట్టవిరుద్ద్ధంగా లబ్డి పొందుతున్నారన్నారు. కాబట్టి దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు దుబ్బాక బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు.