Reading Time: < 1 minute

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ’ది పారడైజ్’ ప్రతి అప్‌డేట్ ఈ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి పనిచేస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాని జడల్ పాత్రలో పవర్‌ఫుల్‌గా, తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఓ కొత్త అవతార్‌లో కనిపిస్తున్నారు.

బలమైన శరీరం, పొడవైన జడలు కట్టిన జుట్టు, రగ్గడ్ గడ్డం, మీసాలతో నాని లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ సినిమాలో కీలకమైన జైలు ఫైట్ సీన్‌కి సంబధించినది. ఫారిన్ ఫైటర్లతో జరిగే హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ఇది. కథను కీలక మలుపు తిప్పే ప్రధాన ఘట్టాల్లో ఒకటిగా నిలవనుంది. దసరాతో పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను కూడా అదే స్థాయిలో రా, రగ్డ్, రియలిస్టిక్ టోన్‌తో రూపొందిస్తున్నారని ఈ పోస్టర్ స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ సినిమా 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది.