Reading Time: < 1 minute

అమరావతి: ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వైసిపి ప్రభుత్వం చేసిన ఆపచారాలను సరి చేశామన్నారు. నెల్లూరులో ఆనం మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టడంతో పాటు వేద విద్యను ప్రోత్సహిస్తున్నామని ప్రశంసించారు. కూటమి ఏర్పడడంతో రామరాజ్య ప్రారంభమైందని సూపర్ సిక్స్ హామీలతో ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్నారు. ఎపి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శలు చేయడం బాధగా ఉందని మండిపడ్డారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేట్స్‌మన్ అని ప్రపంచమంతా కీర్తిస్తోందన్నారు. చంద్రబాబు పరిపాలన కెసిఆర్‌కు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత? అని ఆనం విమర్శలు  గుప్పించారు.