Reading Time: 2 minutes

మనతెలంగాణ/హైదరాబాద్:డిసెంబర్ 31వ తేదీ న్యూ ఇయర్ వేడుకల నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా మద్యంతో పాటు బిర్యా నీ విక్రయాలు భారీగా జరిగాయి. డిసెంబ ర్ 31వ తేదీ ఒక్కరోజే రూ.315 కోట్ల మ ద్యాన్ని ఎక్సైజ్ శాఖ విక్రయించగా, ఇదే రో జు సుమారుగా 6 కోట్ల బిర్యానీ విక్రయా లు జరిగాయని గణాంకాలు పేర్కొంటున్నాయి. న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని మందుబాబులు, భోజన ప్రి యులు ఈ రికార్డులను సృష్టించారు. గత సంవత్సరం కన్నా 2025 డిసెంబర్ 31వ తేదీన హోటళ్లు, రెస్టారెంట్‌లు, క్లబ్‌లు, పబ్ లు, ఫాంహౌజ్‌లు కళకళలాడాయి. 2025, డిసెంబర్‌లో 1వ తేదీ నుంచి నాలుగోతేదీ వరకు రూ.756 కోట్ల 34 లక్షల రూపాయల లిక్కర్ విక్రయాలు జరిగాయి. ఈ నెల 1వ తేదీన రూ.183 కోట్ల 5 లక్షలు, 2వ తేదీన రూ.207కోట్లు, 03 తేదీ న 187.52 కోట్లు, 04వ తేదీన 178. 29 కో ట్లు, ఈనెల 16వ తేదీ నాటికి 2,761 కో ట్లు, 17వ తేదీన 120 కోట్ల మద్యం వి క్రయాలు జరిగాయి. మొత్తంగా ఈ నె ల 17వ తేదీ నాటికి రూ.2,881 కోట్ల ఆదాయాన్ని ఆ శా ఖ ఆర్జించింది. ఇక, ఈ నెల 29నాటికి రూ. 4361కోట్ల ఆదాయం, 30వ తేదీన రూ. 250 కోట్లు, 31వ తేదీన రూ.315 కోట్ల ఆ దాయంతో డిసెంబ ర్ నెల మొత్తం రూ.5,050 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. 2023 సంవత్సరం డి సెంబర్‌లో రూ.4,250 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుతం ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో 31వ తేదీ వరకు రూ.5,050 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి గతంలో ఉన్న రికార్డును ఎక్సైజ్ శాఖ అధిగమించింది. 2023 సంవత్సరం కన్నా ఈసారి రూ.800 కోట్ల ఆదాయం అధికంగా రావడంతో ఎక్సైజ్ శాఖ ఈ రికార్డును అధిగమించింది.

కిటకిటలాడిన బిర్యానీ రెస్టారెంట్‌లు

2025, డిసెంబర్ 31వ తేదీన రెస్టారెంట్‌లు, హోటళ్ల వద్ద భారీగా రద్దీ నెలకొంది. చాలా రెస్టారెంట్లు, ముఖ్యంగా బిర్యానీ సెంటర్లు కిటకిటలాడాయి, పండుగ వాతావరణం నెలకొంది. ఆహార నాణ్యతపై కొందరు భోజన ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు. అధిక అమ్మకాల నేపథ్యంలో రెస్టారెంట్‌లు, హోటళ్ల యజమానులు ఆహార నాణ్యతలో సరైన ప్రమాణాలు పాటించలేదన్న ఆరోపణలు వినిపించాయి. నాణ్యత కొరవడిన గత సంవత్సరం కన్నా ఈసారి బిర్యానీ విక్రయాల్లో రికార్డు సృష్టించడం విశేషం.గత సంవత్సరం 5 కోట్ల బిర్యానీ విక్రయాలు జరిగినట్టుగా గణాంకాలు పేర్కొంటున్నాయి.