Reading Time: < 1 minute

ప్రతిష్టాత్మక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ’పతంగ్’. పతంగుల పోటీతో రాబోతున్న యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్ డ్రామా చిత్రమిది. సినిమాటిక్ ఎలిమెంట్స్, రిష్న్ సినిమాస్, మాన్‌సూన్ టేల్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్ డ్రామా చిత్రానికి విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు, ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. ఈ చిత్రంలో ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ముఖ్య తారాగణం. డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవ కట్టా మాట్లాడుతూ “ఇదొక కొత్తరకమైన సినిమా. ట్రైలర్ చూడగానే సూపర్ థ్రిల్‌గా ఫీలయ్యాను. ఓ సూపర్‌హిట్ సినిమాకు. బ్లాక్‌బస్టర్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి”అని అన్నారు. ప్రణవ్ కౌశిక్ మాట్లాడుతూ కంటెంట్ పరంగా పెద్ద సినిమా ఇదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రీతి పగడాల, వంశీ పూజిత్, వడ్లమాని శ్రీనివాస్, రాహుల్ మోపిదేవి, ఆదినారాయణ, నాని బండ్రెడ్డి, సంపత్ మక తదితరులు పాల్గొన్నారు.