Reading Time: < 1 minute

ఎవరెస్ట్ యాత్రలో విషాదం.. దిగి వస్తుండగా ఇద్దరు భారతీయులు మృతి

Caption of Image.

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌‌పై విషాదం చోటు చేసుకుంది. ఎవరెస్ట్ యాత్రకు వెళ్లిన ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. పర్వతారోహణ ముగించుకొని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు నేపాల్ అధికారులు తెలిపారు. మృతుల్లో ఒకరు సందీప్ ఆరే, ఏపీ హిందూపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సందీప్ అమెరికాలో స్థిరపడి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నట్లు సమాచారం అందుతోంది. మే 20న ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన సందీప్.. మరుసటి రోజు తీవ్ర అనారోగ్యంతో సందీప్ మృతి చెందారు. గతంలో కిలిమంజారో  సహా పలు శిఖరాలను అధిరోహించిన అనుభవంఉంది.

ఇక మరో మృతుడిని అరుణ్ కుమార్ తివారిగా గుర్తించారు. హైదరాబాద్ లో స్థిరపడిన తివారీ  ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు.  ఐటీ రంగంలో పనిచేస్తూనే పర్వతారోహణలో విశేష అనుభవం సంపాదించారు.  వారిని రక్షించేందుకు తమ గైడ్స్‌ తీవ్రంగా ప్రయత్నించారు, అయినా ఫలితం లేకపోయింది. మృతదేహాలను దిగువకు తీసుకురావడానికి కొనసాగుతున్న చర్యలు కొనసాగుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.