Reading Time: < 1 minute

ప్రతీ బుధవారం ఏనుమాముల మార్కెట్ బంద్

Caption of Image.

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్  ప్రతి బుధవారం బంద్​ ఉంటుందని మార్కెట్​ సెక్రటరీ మల్లేశం సోమవారం  ఒక ప్రకటలో తెలిపారు.  ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున రైతులు, వ్యాపారులు, కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సరుకుల వేలం పాట సమయాల్లో మార్పుతో పాటు,  ప్రతి బుధవారం మార్కెట్​ బంద్​ ఉంచుతున్నట్టు  తెలిపారు.  23వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ అమలులోకి వస్తుందని ప్రకటించారు.  రైతులు ఈ మార్పులను గమనించి  బంద్​  రోజుల్లో సరుకులు తెచ్చి   ఇబ్బందులు పడొద్దని సెక్రటరీ మల్లేశం కోరారు. 

©️ VIL Media Pvt Ltd.