
బోడుప్పల్: మేడిపల్లి మండలం బోడుప్పల్ పరిధిలోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్ ప్రధాన గేటుకు భవన యాజమాన్యం తాళం వేసింది. అగ్రిమెంట్ వివాదం పేరుతో జరిగిన ఈ చర్యతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ యాజమాన్యం 2027 మార్చి వరకు ఒప్పందం ఉందని చెబుతుండగా, భవన యాజమాన్యం మాత్రం గడువు ముగిసిందని వాదిస్తోంది. ఈ వివాదం మధ్యలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
దానికి తోడు నారాయణ కాన్సెప్ట్ స్కూల్ లీజ్ సమయం అయిపోవడంతో గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం జనవరి 2 వ తేదీన భవన యజమానుల వద్ద నుంచి 10 సంవత్సరాల అగ్రిమెంటు చేయించుకున్నామని గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం తెలిపారు.
►ALSO READ | హైదరాబాద్‌లో 70% మంది కిరాయిదారులే.. అద్దె ఇళ్లకే మస్త్ డిమాండ్..
ఏప్రిల్ 17 వరకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో నారాయణ స్కూల్ దగ్గరకు కూడా తాము రాలేదని, నెక్స్ట్ అకడమిక్ ఇయర్ కోసం తాము బిల్డింగ్ పొజిషన్ తీసుకోవడానికి రావడం జరిగిందని గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం తెలిపింది. మూడు నెలల ముందు నుంచి తమ స్కూల్ అడ్మిషన్ కోసం టేబుల్ వేసుకొని అదే నారాయణ స్కూల్ గేటు ముందు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నామని, ఇదంతా నారాయణ స్కూల్ యాజమాన్యం చూస్తూ ఉందని గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం తెలిపింది.
ఇక్కడ నడుపుతున్న నారాయణ స్కూల్కు ఎలాంటి పర్మిషన్ లేదని.. దీనిపై ఎంఈఓ, డీఈఓలు కూడా నోటీసులు పంపించడం జరిగిందని చెప్పింది. నెక్ట్స్ అకడమిక్ ఇయర్ లోపు నారాయణ స్కూల్ను ఇక్కడ నుండి ఖాళీ చేస్తున్నామని నారాయణ స్కూల్ యాజమాన్యం తెలిపింది. దీనిపై ఇరువు వర్గాలు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడం గమనార్హం.