Reading Time: 2 minutes

రౌడీ స్టార్ మూవీ ముహూర్తానికి ‘నేచురల్ స్టార్’ క్లాప్.. నెట్టింట వైరల్ అవుతున్న విజయ్-నాని ఫోటోలు!

Caption of Image.

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, హాయ్ నాన్న వంటి క్లాసిక్ హిట్ తో మెప్పించిన యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ చేతులు కలిపారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘VD x Shouryuv’ ప్రారంబోత్సవం ఈరోజు ( ఏప్రిల్ 20, 2026 ) హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ మూవీ విజయ్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలవనుంది.

 పీరియడ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలకు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజయ్ పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నాని క్లాప్ కొట్టడం ఈ వేడుకకే హైలైట్‌గా నిలిచింది. ‘హాయ్ నాన్న’ దర్శకుడికి తన సపోర్ట్ తెలియజేస్తూ, విజయ్‌తో నాని దిగిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

భారతీయ కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందుకోసం హాలీవుడ్‌లో సత్తా చాటిన టెక్నీషియన్లను రంగంలోకి దించారు. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’, ‘ఫాల్ అవుట్’ వంటి ఇంటర్నేషనల్ సిరీస్‌లకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ‘బ్యాట్‌మాన్ ఫరెవర్’, ‘స్నో పియర్స్’ చిత్రాలకు పనిచేసిన ఎరిక్ డర్స్ట్ విజువల్స్ బాధ్యతను తీసుకున్నారు. ‘యానిమల్’, ‘ఓం శాంతి ఓం’ ఫేమ్ సురేష్ సెల్వరాజన్ భారీ సెట్లు నిర్మిస్తున్నారు.

Also Read :  ఈ ఓటీటీ మూవీ కాన్సెప్ట్‌కి రిషబ్ శెట్టి ఫిదా

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అంచనాలను పెంచేసింది. పెంపుడు కుక్కలతో నడుస్తున్న విజయ్, ఆయన వెనుక ఆయుధాలు పట్టుకున్న గుంపు.. ఇవన్నీ ఒక ఇంటెన్స్ డ్రామాను సూచిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న కోపమంతా.. ఒకప్పుడు ప్రేమే అనే క్యాప్షన్ సినిమా లోని ఎమోషనల్ డెప్త్‌ను తెలియజేస్తోంది అంటూ విజయ్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం విజయ్ ‘రణబలి’, ‘రౌడీ జనార్దన’ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ కానున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. భారతీయ భావోద్వేగాలకు, అంతర్జాతీయ హంగులు అద్ది వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తుందో చూడాలి. 

 

©️ VIL Media Pvt Ltd.