
డిజిటల్ మీడియా రంగంలో V6 News యూట్యూబ్ ఛానెల్ చారిత్రాత్మక మైలురాయిని దాటింది. 12 మిలియన్స్.. అంటే కోటి 20 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ తో చరిత్ర సృష్టించింది. ఉన్నది ఉన్నట్లు మాత్రమే.. వార్తను వార్తగా మాత్రమే చూపిస్తూ నెటిజన్ల మన్ననలు పొందటంలో వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్ విశ్వసనీయతకు ఇది నిదర్శనం. కోటి 20 లక్షల మంది ఆత్మీయత, ఆదరణకు వీ6 న్యూస్ వినమ్రంగా శత కోటి వందనాలు చెబుతోంది.
తప్పుడు తంబ్స్ లేవు.. ఏమార్చే కథనాలు అంతకన్నా లేవు.. జనం మాటను.. వీ6 గొంతుకగా.. నిరంతరం జనం పక్షం నిలుస్తూ వస్తున్న వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్ కు దక్కిన గౌరవం ఇది. 12 మిలియన్స్.. కోటి 20 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ తో తెలుగు మీడియా రంగంలో చారిత్రాత్మకమైన అడుగు ఇది. ఇది నెంబర్ కాదు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి.. తెలుగు ప్రజల ఆత్మీయత, ఆదరణకు నిదర్శనం వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్.
2013.. జనవరి 26వ తేదీ.. గణతంత్ర దినోత్సవ వేడుకల నాడు.. వీ6 న్యూస్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. నాటి నుంచి నేటి వరకు అదే ఒరవడి.. అదే విశ్వసనీయత.. అదే జోరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశీ గడ్డపై ఉన్న తెలుగు వాళ్లందరికీ వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్ అనేది ఓ ఎమోషన్. గల్లీ నుంచి ఢిల్లీ వరకే కాదు.. గల్ప్, అమెరికా, యూకే వంటి దేశాల్లో ఉన్న తెలుగు వాళ్లందరికీ అరచేతిలో అనుక్షణం గుర్తు చేస్తూ ఉంటుంది అనటానికి వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్ సాధించిన 12 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఓ నిదర్శనం.
హైప్.. హడావిడి లేదు.. వాస్తవాన్ని వాస్తవంగా చూపించాం.. ఉన్నది ఉన్నట్లు చెప్పాం.. మాటలకు మర్మం ఇవ్వలేదు.. మాయలు అంతకన్నా లేవు. అందుకే వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్ అంటే తెలంగాణకే కాదు.. తెలుగు ప్రజలకే కాదు.. విదేశీ గడ్డపై ఉన్న ప్రతి వాళ్లకు వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ న్యూస్ ఛానెల్ అయ్యింది.
వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్ 12 మిలియన్స్.. కోటి 20 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ తో.. అన్ స్టాపబుల్ గా కొనసాగుతుంది.. కొనసాగుతూనే ఉంటుంది. మీరు, మేము, మనం ఉన్నంత వరకు.. కోటి 20 లక్షల మందికే కాదు తెలుగు ప్రజలు అందరికీ వీ6 న్యూస్ చెబుతోంది శత కోటి వందనాలు.