
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట బిడ్డ ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఆడాలన్నదే తన కలని, అప్పుడే సిద్దిపేట స్టేడియానికి సార్ధకత చేకూరుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకాంక్షించారు. శనివారం రాత్రి సిద్దిపేట స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఏటా కచ్చితంగా నిర్వహిస్తామన్నారు. క్రికెట్ అంటే కేవలం ఒక ఆట మాత్రమే కాదని అది ఒక కమ్యూనిటీ అని అభిప్రాయపడ్డారు. క్రికెట్‌లో ఆల్ రౌండర్లు ఉంటారని, మీరంతా నిజ జీవితంలోనూ ఆల్‌రౌండర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు.
చదవాలి, ఉద్యోగం చేయాలి, సమాజానికి సేవ చేయాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినప్పుడే మీరు అసలు సిసలైన ఆల్ రౌండర్లు అనిపించుకుంటారని క్రికెట్‌ను టైంపాస్ గా కాకుండా సీరియస్ గా తీసుకుంటే భవిష్యత్తు ఉంటుందన్నారు . రెండు రోజుల కింద మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిలైతే అందరం బాధపడ్డామని పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు పెరిగి మహిళలు చట్టసభల్లో కోరుకుంటున్నానన్నారు. వచ్చే ఏడాది కేసీఆర్ టోర్నీలో మహిళా జట్లకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సందర్బంగా విన్నర్స్ గణేశ్‌నగర్ 11, రన్నర్స్ కింగ్స్ ఖాదర్ పుర జట్లకు ట్రోఫీలను అందజేశారు.