
కాశీబుగ్గ, వెలుగు: ప్లాస్టిక్నిషేదిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దామని వరంగల్ కలెక్టర్సత్య శారదాదేవి పిలుపునిచ్చారు. ఆదివారం ఓ సిటీలోని కాలనీలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ కు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకు శుభ్రత పరిశుభ్రత, వైద్య ఆరోగ్యం, అరైవ్ అలైవ్ పూర్తి చేసుకున్నామన్నారు.
ప్రజా పాలనలో స్వచ్ఛత, పరిసరాల శుభ్రత ముఖ్య భాగమన్నారు. ఓ సిటీ కాలనీ వాసులు ప్లాస్టిక్ నిర్మూలన, పచ్చదనంపై అవగాహన కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని కొనసాగించాలని కోరారు. అనంతరం కర పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బోబ్బల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి బజ్జురి వేణుగోపాల్, ఉద్యానవన శాఖ అధికారి లక్ష్మారెడ్డి, డీపీఆర్వో ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.