
గ్రేటర్ వరంగల్, వెలుగు: మహిళలపై బీజేపీ నాయకులు కపట ప్రేమ చూపిస్తున్నారని, మహిళా రిజర్వేషన్‌ను 2024లో ఎందుకు అమలు చేయలేదని వరంగల్ డీసీసీ ప్రెసిండెంట్ మహ్మద్ ఆయూబ్ ప్రశ్నించారు. ఆదివారం కరీమాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
పార్లమెంట్‌లో బీజేపీ కూటమి తీసుకొస్తున్న బిల్లులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సరైన చర్చ చేయకుండానే బిల్లు హడావిడిగా ప్రవేశపెట్టడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇండియా కూటమి, ఏకతాటిపైకి వచ్చి బీజేపీ తీరును తిప్పికొడుతున్నాయని ఆయన తెలిపారు.