Reading Time: < 1 minute

కొంపల్లిలోని ‘బిగ్ బాస్కెట్’లో కుళ్లిన కూరగాయాలు

Caption of Image.
  •     వేర్​హౌస్​లో పావురాల మలం, సాలెగూడ్లు
  •     కొంపల్లిలో ఫుడ్​ సేఫ్టీ ఫ్లయింగ్​ స్క్వాడ్​ తనిఖీలు 

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ కొంపల్లిలోని బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్కెట్ వేర్​హౌస్​లో ఫుడ్​ సేఫ్టీ ఫ్లయింగ్​ స్క్వాడ్​ తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఆహార పదార్థాలను ప్రమాదకర పరిస్థితుల్లో నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. పావురాల మలం, సాలెగూడ్లతో నిండిన ప్రదేశంలోనే వస్తువులు నిల్వ చేయడం కనిపించింది. అలాగే ఎలుకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. 

అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన కూరగాయలు బూజుపట్టి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. చికెన్, చేపల నమూనాలను సేకరించి ల్యాబ్​కు పంపించారు. చింతపండు ప్యాకెట్లపై గడువు ముగిసిన విషయం బయటపడకుండా ఉండేందుకు లేబుళ్లు మార్చారు. వాటిని ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాల రవాణాకు వినియోగిస్తున్న 22 వాహనాలు తుప్పు పట్టిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు.

©️ VIL Media Pvt Ltd.