
హార్ముజ్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మరోసారి హార్ముజ్ జలసంధిలో కాల్పులు జరపాలని నిర్ణయించుకుంది.. ఇది మా కాల్పులువిరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించనట్లే.. ఇది మంచిది కాదు.. మా ప్రతినిధులు రెండో విడత చర్చలు పాకిస్తాన్ కు వెళ్తున్నారు. ఈ చర్చల్లో ఇరాన్ మా డిమాండ్లను ఒప్పుకుందా సరేసరి.. లేదా ఎన్నడూ చూడని రీతిలో దాడులు చేస్తాం.. ఇరాన్ మొత్తాన్ని నాశనం చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
సోమవారం ఏప్రిల్ 20, 2026 చర్చలు ఇరాన్ తో చర్చలు జరగనున్న క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.. ఇది వింతగా ఉంది.. హార్ముజ్ మూసివేస్తే ఇరాన్ కే నష్టం.. 500 మిలియన్ డాలర్ల నష్టపోయేది వారే.. యూఎస్ కు ఎలాంటి నష్టం లేదు. మా షరతులు అంగీకరించకపోతే ఇరాన్ లోని ప్రతి విద్యుత్ ప్లాంట్ ను, ప్రతి వంతెనను పేల్చివేస్తాం.. అలా చేయడం మాకు చాలా సులభం.. అణు ఒప్పందాన్ని అంగీకరించకపోతే ఇరాన్ ను స్వాధీనం చేసుకుంటా.. ఇరాన్ హత్యా యంత్రాంగానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని’’ ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు.