
వాట్సాప్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో చేసే పర్సనల్ చాట్‌లతో పాటు వివిధ వ్యాపార సంస్థల నుంచి వచ్చే మెసేజ్‌లు కూడా ఒకే చోట కనిపిస్తుంటాయి. దీనివల్ల ముఖ్యమైన మెసేజ్‌లను గుర్తించడం ఒక్కోసారి కష్టమవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌లో ఈ సరికొత్త ఆప్షన్ కనిపిస్తోంది.
బిజినెస్ అకౌంట్స్ నుంచి మెసేజ్‌లన్నీ 24 గంటల తర్వాత ఆటోమెటిక్‌గా ఒక స్పెషల్ సెక్షన్‌కి వెళ్లిపోతాయి. దీంతో ప్రమోషనల్ మెసేజ్‌లు, వ్యాపార ప్రకటనలు మీ పర్సనల్ చాట్‌ల మధ్య రాకుండా ఉంటాయి. దీంతో స్పామ్ మెసేజ్‌ల సమస్య తగ్గుతుంది. యూజర్లకు తమ అకౌంట్‌పై మరింత కంట్రోల్ వస్తుంది.
ఆర్డర్ వివరాలు లేదా కస్టమర్ సపోర్ట్ వంటి ముఖ్యమైన బిజినెస్ చాట్‌లను వెతకడం ఇప్పుడు మరింత ఈజీ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.