Reading Time: < 1 minute

అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం… ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా… బస్సులో 36 మంది ప్రయాణికులు..

Caption of Image.

ఏపీలోని అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( ఏప్రిల్ 19 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… అనకాపల్లిలోని నక్కపల్లి జాతీయరహదారి దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

చెన్నై నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.