
80–90ల నాటి మధురమైన జ్ఞాపకాలను మళ్లీ మీ ముందుకు తీసుకురావడానికి గాడ్‌హౌస్ మికో పోర్టబుల్ క్యాసెట్ ప్లేయర్ వచ్చేసింది. పాత డిజైన్‌లో కనిపిస్తున్నప్పటికీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇది 1980ల నాటి జపాన్ మోడల్లో ఉంటుంది. పాత రోజుల్లోలాగే ఇందులో పాటలు వినొచ్చు. వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు, స్పీకర్ల ద్వారా వినడానికి ఇందులో బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులోని మైక్రోఫోన్ సాయంతో మీ వాయిస్‌ను, ఇతర శబ్దాలను నేరుగా క్యాసెట్లోకి రికార్డ్ చేయొచ్చు.
సొంతంగా మిక్స్‌టేప్స్ తయారుచేసుకోవచ్చు. ప్లే, ఫాస్ట్ ఫార్వర్డ్, రివైండ్, స్టాప్, రికార్డ్ అనే ఐదు బటన్లతో ఇది చాలా తేలికగా పని చేస్తుంది. పైన ఉండే టాన్స్పరెంట్ గ్లాస్ వల్ల క్యాసెట్ తిరుగుతున్నట్టు చూడొచ్చు.
ఇది కేవలం192 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. రెండు చిన్న బ్యాటరీలతో లేదా యూఎస్‌బీ కేబుల్ సాయంతో వాడుకోవచ్చు. మీ దగ్గర పాత క్యాసెట్లు ఉండి వాటిని సరికొత్తగా వినాలనుకుంటే గాడ్‌హౌస్ మికో బెస్ట్ చాయిస్. దీని ధర 8,200 నుంచి 9,000 రూపాయల వరకు ఉంటుంది.