Reading Time: < 1 minute

జీమెయిల్లో వాట్సాప్ ఫీచర్..! ఇప్పుడు వాయిస్ రికార్డ్ కూడా…

Caption of Image.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే జీమెయిల్‌‌లో గూగుల్ ఒక సూపర్బ్​ చేంజ్​ తీసుకొచ్చింది. అదేంటంటే.. వాట్సాప్ లాగ ఇందులోనూ ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌‌క్రిప్షన్’ విధానాన్ని తెచ్చారు. దీనివల్ల సమాచారం పంపే వాళ్లు, స్వీకరించే వాళ్లు తప్ప మధ్యలో గూగుల్ సంస్థ కూడా మీ మెయిల్స్​ను చదవలేదు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ వాడే వారికి కూడా అందుబాటులోకి వచ్చింది. గూగుల్ చాట్ విభాగంలో ఇప్పుడు నేరుగా వాయిస్​ రికార్డ్ చేసి పంపొచ్చు. 

కేవలం మైక్రోఫోన్ బటన్ నొక్కి పట్టుకోవడం ద్వారా మీ మాటలను అవతలి వారికి ఈజీగా పంపే వీలుంది. ఈ కొత్త మార్పుల వల్ల జీమెయిల్ కేవలం మెయిల్ పంపుకోవడానికే కాకుండా, ఇన్​స్టంట్ మెసేజ్​ల కోసం వాట్సాప్ లాగే వేగంగా ఉపయోగపడుతుంది. కాన్ఫిడెన్షియల్ మెసేజ్​ పంపేవాళ్లకు, వ్యాపార సంస్థలకి ఈ ఫీచర్ పనికొస్తుంది. ప్రస్తుతానికి ఇది కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
 

©️ VIL Media Pvt Ltd.