
తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా కశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించారు. శనివారం ‘జింగాలా’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. స్వీకర్ అగస్తి కంపోజ్ చేయగా, నకాష్ అజీజ్ ఎనర్జిటిక్‌గా పాడాడు.
‘అనగనగనగా.. మనతో కలిసేను పిల్ల.. మందు గ్లాసులో ఐసులా.. అనుకోకుండా మిగిలా నేను ఒంటరిలా.. చెస్ బోర్డులో డైస్‌లా.. సారీ దునియా.. నాకు తానే అనేలోపే పోయేనా.. జింగాలా లాలే లాలే..’ అంటూ కశ్యప్ శ్రీనివాస్, సునీల్ కరంకంటి, శ్రీని జోస్యుల రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. బార్ బ్యాక్‌డ్రాప్‌లో కలర్‌ఫుల్‌గా చిత్రీకరించారు.
జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో మానస చౌదరి, విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మే 1న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.