Reading Time: < 1 minute

టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్ చేసిన స్మృతి.. తొలి భారత క్రికెటర్‎గా రేర్ ఫీట్

Caption of Image.

టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందనా అరుదైన ఘనత సాధించింది. భారత్ తరుఫున టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు (4244) చేసిన తొలి ప్లేయర్‎గా రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (4231) పేరిట ఉండేది. డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగుల చేయడం ద్వారా హిట్ మ్యాన్ రికార్డ్‎ను స్మృతి బద్దలు కొట్టింది. 

అలాగే, మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు (4717) చేసిన రికార్డ్ న్యూజిలాండ్ క్రీడాకారిణీ సుజీ బైట్స్ పేరిట ఉంది. ఇక, పురుషుల టీ20ల్లో అత్యధిక పరుగులు (4596) చేసిన జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ బాబార్ అజామ్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. 

ఇక మ్యా్చ్ విషయానికి వస్తే.. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‎లో సౌతాఫ్రికా బోణీ కొట్టింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఉమెన్స్ టీమ్‏ను చిత్తు చేసింది. ఆల్ రౌండ్‎తో షో అదరగొట్టిన అతిథ్య సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఉమెన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

 కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ (47), జెమీమా రోడ్రిగ్స్ (36), షెఫాలీ వర్మ (34) రాణించారు. ఇండియా నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ (51 ), అనెరీ డెర్సెన్ (44 ) విజయంలో కీలకపాత్ర పోషించారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు పడగొట్టగా.. అరుంధతిరెడ్డి, శ్రీచరణి తలో వికెట్ తీశారు.

©️ VIL Media Pvt Ltd.