
ఐపీఎల్ 2026 ఉత్కంఠగా సాగుతోంది. ఎస్ఆర్ హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ ( ఏప్రిల్ 18 ) ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7:30 కి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు వేల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని… 430 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు పోలీసులు. సాయంత్రం 4:30 గంటల నుంచి ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు.
స్టేడియంలోకి వీటికి అనుమతి లేదు:
- మ్యాచ్ సందర్భంగా స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు, 11 పార్కింగ్ పాయింట్లు
- ల్యాప్టాప్‌లు, బ్యాగులు, గాడ్జెట్లు స్టేడియం లోకి నిషేధం
- వాటర్ బాటిల్స్, సిగరెట్లు, లైటర్లు కూడా నో ఎంట్రీ
- బ్యానర్లు, పదునైన వస్తువులపై పూర్తి నిషేధం
గత మ్యాచ్ టైమ్ లో స్మార్ట్ వాచ్ లు, సన్ గ్లాసెస్, వాలెట్ లు అనుమతించలేదని తెలిపారు పోలీసులు. ఈ మ్యాచ్ కి వాటిని తీసుకురావద్దని సూచిస్తున్నారు పోలీసులు. క్లాక్ రూమ్ సౌకర్యం లేదు కాబట్టి తమ వస్తువులను ఇంటి వద్దే పెట్టీ రావాలని సూచించారు.
ఇదిలా ఉండగా..యువ పేసర్ల మెరుపులు, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ తో జోరుమీదుంది SRH. వరుసగా రెండు విజయాలతో ఫామ్ లోకి వచ్చింది CSK. ఈ సీజన్ లో ఐదు మ్యాచుల్లో ఇరు జట్లు రెండు మ్యాచులు గెలిచాయి. ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న ధోని ప్రాక్టీస్ లో కూడా పాల్గొన్నాడు. ఈ సీజన్ లో గాయంతో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ.. ఈ మ్యాచ్ లో ఆడే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ఫ్యాన్స్. SRH స్టార్ ప్లేయర్ ఫ్యాట్ కమిన్స్ కూడా గాయం నుంచి కోలుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఉప్పల్ స్టేడియం ఫ్లాట్ పిచ్ కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.SRH బ్యాటింగ్ లైన్ అప్ స్ట్రాంగ్ గా ఉండగా… CSK లో మంచి ఫామ్ లో ఉన్నారు సంజు శాంసన్, ఆయుష్ మాత్రే. హోమ్ గ్రౌండ్ లో జరిగిన రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో రాణించాలని భావిస్తున్నారు ఫ్యాన్స్. యువ ఆటగాళ్లు ప్రఫుల్, సాకిబ్ హుస్సేన్, హర్ష్ దూబే, శివాంగ్ తో కలిసిన బౌలింగ్ యూనిట్ తో బరిలోకి దిగనుంది SRH. గాయం కారణంగా ఈరోజు మ్యాచ్ కి CSK కీ బౌలర్ ఖలీల్ అహ్మద్ దూరం కానున్నాడు.