Reading Time: < 1 minute

సూరేపల్లి సుజాతకు దళిత సంఘాల సంఘీభావం 

Caption of Image.

కరీంనగర్ టౌన్,వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సలైట్ పేరిట వేధింపులు ఎదుర్కొంటున్న సోషియాలజీ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోడీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతను శుక్రవారం దళిత సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. అంతకుముందు వీసీ ఉమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి మాట్లాడారు. ప్రొఫెసర్ సుజాత విషయంలో వేధింపులు ఆపాలని సూచించారు.  యూనివర్సిటీలో ప్రశ్నిస్తే వారిని  అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి వేధించడం తగదన్నారు. అలాంటి విద్యార్థులను వీసీ ప్రోత్సహించడం మానుకోవాలని లేదంటే దళిత సంఘాల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ప్రొఫెసర్ సుజాతను, వీసీ ఉమేష్​ కుమార్ ను కలిసిన వారిలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ, ఎంఎస్పీ నాయకులు రేణుకుంట్ల సాగర్, తునికి వసంత్, దండు అంజయ్య, రాజన్న, శంకర్, కనకం అంజి బాబు, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చెంచాల నవీన్ మాదిగ, కొమురక్క, వరలక్ష్మి, వాణి, పౌలు, మల్లయ్య మాదిగ ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.